కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గ్రూప్ -3 పరీక్షలను సమన్వయంతో, సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్ -3 పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు.
అభ్యర్థుల బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని, విమర్శలకు తావివ్వకుండా అభ్యర్థులను పరీక్ష హాలులోకి తనిఖీ చేసి పంపించాలని తెలిపారు. అభ్యర్థుల అటెండెన్స్ ఆరోపణలకు తావివ్వకుండా చూడాలని తెలిపారు. అభ్యర్థుల బయో మెట్రిక్ అటెండెన్స్, ఆన్లైన్ అటెండెన్స్ లో వ్యత్యాసం రాకుండా నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థుల వెంట సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జస్ లను పరీక్ష కేంద్రాలకు తీసుకరాకూడదని తెలిపారు. ప్రతీ సెంటర్ ముందు సెంటర్ పేరు, సెంటర్ కోడ్, లు తెలిపేవిధంగా ఫ్లెక్సీ లను ఏర్పాటుచేయాలని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో త్రాగునీరు, మెడికల్ కిట్ తో పాటు వైద్య సిబ్బంది ఏర్పాటు చేయాలని, పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలుగకుండా ఏర్పాటు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల బయో మెట్రిక్ అటెండెన్స్ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2 గంటలకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, రీజనల్ కో ఆర్డినేటర్ విజయ్ కుమార్, ట్రైనర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.