బాన్సువాడ, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం ఆప్రజాస్వామికమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు పచ్చని పంట పొలాలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడ్డారని, ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకమని చెప్పినందుకే రైతులపై కేసులు బనాయించారన్నారు. రైతుల అరెస్టును బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు వారికి అండగా ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు.