కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గురువారం జిల్లా ఎస్పీ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ బాలసదన్ పిల్లలతో కామారెడ్డి జిల్లా గర్ల్స్ హైస్కూల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు.
ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసదన్ పిల్లలచే స్వయంగా ఎస్పీ కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవం సందర్భంగా నృత్యం, విజ్ఞానం, సృజనాత్మక రచన, ఆటలు, పాటలు లాంటి విభాగాల్లో ప్రతిభ కనబరచిన చిన్నారులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఉన్నత లక్ష్యం సాధించడానికి ఏకాగ్రత అవసరమనీ, ఇష్టపడి చదివితే సమగ్ర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అకాంక్షించారు. అనంతరం జిల్లా గర్ల్స్ హైస్కూల్లో జరుగుతున్న టీచర్స్ డే ప్రోగ్రాం లో పాల్గొని జిల్లా ఎస్పీ గారు స్వయంగా షీ టీం, 100 డైల్, సైబర్ క్రైమ్ గురించి అడిగి తెలుసుకొని వాటి ప్రాధాన్యత గురించి వివరించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, జడ్పీ సి.ఈ. ఒ., జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, కామారెడ్డి ఎస్. హెచ్. ఓ. చంద్రశేఖర్ రెడ్డి, బాల సదన్ టీచర్లు, చిన్నారులు పాల్గొన్నారు.