నిజామాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశానికి నెహ్రూ అందించిన సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.