బాన్సువాడ, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో పై జీవనాధారం సాగిస్తున్న వారి కుటుంబాలు అగమ్య గోచరంగా తయారయ్యాయని సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఎన్నికల ముందు టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించి డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ఈనెల 20వ తేదీన బస్ డిపో నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి ఆటో డ్రైవర్ల సమస్యలపై వినతి పత్రం అందించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు చాంద్, అప్సర్ ఖాన్, విజయ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.