కామారెడ్డి, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శనివారం మహిళా పిల్లల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, కార్యాలయ సిబ్బంది వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.