నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను, 9,880 మంది హాజరు కాగా, 10,058 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 49.54 శాతం హాజరు నమోదయ్యిందని అన్నారు.