బాన్సువాడ, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణానికి ఈనెల 24న సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు విచ్చేయుచున్నారని అయ్యప్ప ఆలయ నిత్య అన్నదాన ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి అలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గరికపాటి నరసింహారావు ప్రవచనాన్ని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు భక్తులు తరలివచ్చి ప్రవచనాన్ని విని తరించాలని వారు కోరారు.

కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు బెజగం శంకర్ గురుస్వామి, గురుస్వాములు కొత్తకొండ భాస్కర్,నరసన్న చారి, రాజు, ర్యాలీ విట్టల్ రెడ్డి, తాటి ప్రశాంత్, వీరప్ప, మల్లికార్జున్, సుధాకర్, సాయిలు, మొగులయ్య, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.