నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మోర్తాండ్ భీంగల్ నిజామాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 9 కేసుల్లో పట్టుబడినటువంటి గంజాయి, ఆల్ఫా జోలం, డైజీ ఫామ్ లను కాల్చి వేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ వి సోమిరెడ్డి అదేశాల మేరకు 9 కేసుల్లో పట్టుబడిన గంజాయిని దాహనం చేశారు.
కాల్చివేనిన గంజాయి విలువ రూ. 1.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని జక్రాన్ పల్లి మండలం పాడుకర్ గ్రామంలో శ్రీ మెడికేర్ సర్వీస్ లో దహనం చేశారు. గంజాయి దహన కార్యక్రమంలో ఎస్ మల్లారెడ్డి తో పాటు ఎస్‌హెచ్‌వోలు స్టీవెన్స్, గుండప్ప, దిలీప్, వేణు మాధవరావులు పాల్గొన్నారు. గంజాయిని దహనం చేసిన ఎక్సైజ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.