నిజామాబాద్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మంగళవారం కాంగ్రెస్ భవన్‌లో భారత మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరాని, ఆమె ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల సరసన భారత్ దేశాన్ని ఉన్నతమైన దేశంగా నిలబెట్టిందని, బ్యాంకుల జాతీయకరణం చేయడం, ఘరిభీ హటావో నినాదం, హరిత విప్లవం, 20 సూత్రాల పంచవర్ష ప్రణాళిక ల ద్వారా దేశ ప్రజల అభివృద్ధి కృషి చేశారని ఆయన అన్నారు.
ఇందిరా గాంధీ మరణించిన రోజున ఉత్తర భారతం అంధకారంలోకి వెళ్లిందని, ఆమె మరణించిన రోజున పోచంపాడులో సభ నిర్వహిస్తున్న మేము అత్యవసరంగా డిల్లీకి వెళ్లడం జరిగిందని, ఆమె మరణాంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపారని, ఇందిరా గాంధీ కుటుంబం ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కుటుంబమని కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చిన అందరూ కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని తాహెర్ అన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డీ రాజారెడ్డి, జిల్లా సేవాదళ్ సంతోష్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రిథం, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, డిసిసి డెలిగేట్ ప్రమోద్, మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ, ఉష,మలైకా బేగం, విజయలక్ష్మి,ధర్మ గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాయిలు సంగెం, మాజీ మేయర్ ఆకుల సుజాత, అపర్ణ, సాయి కుమార్, అడెం ప్రవీణ్ కుమార్,ముషు పటేల్, స్వప్న, ఆకుల మహేందర్ పాల్గొన్నారు.