బీర్కూర్, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సన్న వడ్లకు అందిస్తున్న బోనస్ ను రైతులు సద్వినియోగం చేసుకున్నందుకు హర్షణీయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుండి వర్చువల్ గా బిర్కూర్ రైతులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిరచిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించడం జరుగుచిన్నదని తెలిపారు.
కామారెడ్డి, మహబూబ్ నగర్, పెద్ద పల్లి, జనగామ జిల్లాల్లోని రైతులతో మంత్రి మాట్లాడారు. బిర్కూర్ కొనుగోలు కేంద్రం నుండి పోశెట్టి, కిషోర్ అనే రైతులతో మంత్రి మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 2.34 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు 54000 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు సన్న వడ్లు కొనుగోలు చేసిన 1152 మంది రైతులకు 4.3 కోట్ల రూపాయలు బోనస్ జమ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, రైతులు, సహకార సంఘాల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.