బాన్సువాడ, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని బీడీవర్కర్ కాలనీలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్స్ కు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నార్ల ఉదయ్,విట్టల్ యాదవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.