భవిష్యత్తును తీర్చిదిద్దేది గ్రంథాలయాలే…

కామారెడ్డి, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. కామారెడ్డి 57వ జాతీయ గ్రంధాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు భవిష్యత్తు కల్పించేది గ్రంథాలయాలు అని, గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ సమకూర్చడం జరిగిందని తెలిపారు.

ఉపాధ్యాయ, పోలీసు, మెడికల్‌ తదితర శాఖల్లో నియామకాలు చేపట్టామని తెలిపారు. 120 కోట్లతో సమీకృత రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు సాధించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ, గత వారం రోజుల నుండి గ్రంధాలయ వారోత్సవాల నిర్వహించుకోవడం జరుగుతున్నదని, రంగోలి, వ్యాస రచన, మెహందీ, చిత్ర లేఖనం వంటి పోటీలు విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు.

గ్రంథాలయాల్లో రానున్న కాలంలో సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎం. చంద్ర శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ, వారం రోజుల నుండి జరుగుతున్న వారోత్సవాలలో 25 స్కూల్‌ పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. వారికి వివిధ పోటీలను నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు ఉద్యోగ నియామకాల్లో 200 మందికి ఉద్యోగాలు రావడం జరిగిందని, వారందరూ ఈ గ్రంథాలయాల్లో చదువుకున్నవారు అని తెలిపారు. దాతల సహకారంతో పుస్తకాలు కొనుగోలు చేశామని, వై ఫై సౌకర్యం కల్పించబడిరదని తెలిపారు.

దోమకొండ, బీబీపేట్‌, మాచారెడ్డి వంటి గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నడిపిస్తున్నామని వాటికి స్వంత భవనాలను ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. తొలుత పాఠశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. అనంతరం 200 మంది ఉద్యోగాలు పొందిన వారిని శాలువా, మెమెంటో లతో సత్కరించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్‌ రావు, డి ఎస్పీ నాగేశ్వర్‌ రావు, స్థానిక కౌన్సిలర్‌, వైస్‌ చైర్మన్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాద్యాయులు, గ్రంథాలయాల రీడర్స్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Print 🖨 PDF 📄 eBook 📱 ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »