బాన్సువాడ, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బారి నుండి చిన్నారులను ప్రజలను కాపాడాలని కోరుతూ బుధవారం మదిన కాలనీవాసులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు అక్బర్ మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులను, పాదచారులను గాయపరుస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆమె సానుకూలంగా స్పందించి కుక్కల బెడద నుండి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు లయక్ తదితరులు పాల్గొన్నారు.