కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పిల్లలకు విద్య బుద్దులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కుప్రీయాల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామ్, మామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు.
పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం, అందించడంతో పాటు, ఆట పాటలు నేర్పిస్తున్నమని, పప్పెట్ బొమ్మతో, రికార్డర్ తో ఆటపాటలు నేర్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. అనంతరం పిల్లల హాజరు, స్టోర్ రూం లోని సరుకులు, వండిన పదార్థాలన్నీ కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, సూపర్ వైజర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.