కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం కుప్రియల్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం బాలింతతో మాట్లాడుతూ, ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అని అడుగగా, వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు.
రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు అని డాక్టర్ ఆష్మ ను అడుగగా, సుమారు 30 మంది రావడం జరుగుతున్నదని తెలిపారు. ఆశ లు వారి పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్ పాల్గొన్నారు.