కామారెడ్డి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సదాశివనగర్ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వ్యాపార రంగంలో రాణించాలని, అన్నారు.
మండల సమైక్య సభ్యులచే క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళలు స్వయంగా వ్యాపారం చేయడం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకొన వచ్చని తెలిపారు. ప్రతీ రోజూ తయారు చేసే వంటకాలు, రోజువారీ గిరాకీ, తదితర విషయాలు సభ్యురాలు సుజాత తెలిపారు. రోజుకు 3 వేల నుండి 4 వేల వరకు సంపాదిస్తున్నామని, టిఫిన్స్ తయారు చేయడానికి మాస్టర్ ను ఏర్పాటుచేశామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జడ్పీ సీఈవో చందర్,మండల ప్రత్యేక అధికారి,జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీపీఎం రమేష్ బాబు, మహిళా సభ్యురాల్లు, తదితరులు పాల్గొన్నారు.