బాన్సువాడ, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌ల సహకారంతో ఎంతో మంది క్రీడాకారులు తమకంటూ క్రీడల్లో రాణిస్తూ ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొనడం వల్ల తమ గ్రామానికి కాకుండా రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారు. అటువంటి కోవకే చెందిన బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు వాణి దంపతుల పెద్ద కుమార్తె అయిన నేత్ర ఫుట్బాల్ స్కేటింగ్ క్రీడల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈనెల 21 నుండి 26 వరకు టర్కీ దేశంలో టోర్నీలో పాల్గొంటున్నారు.
స్వగ్రామం శాంతాపూర్ అయినప్పటికీ విద్యాభ్యాసం కొరకు హైదరాబాదులో స్థిరపడి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులు వారి లక్ష్యాలకు అనుగుణంగా వారిని ముందుకు తీసుకు వెళ్తూ చిన్నారుల విజయాల్లో పాలుపంచుకుంటున్నారు. నేత్ర క్రీడలతోపాటు చదువులో కూడా నైపుణ్యం కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకత చాటుకోవడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో నేత్ర క్రీడారంగంలో మరింత రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, క్రీడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.