మాక్లూర్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామంలో శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు మాణిక్ బండార్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి సీనియర్ నాయకుడు బాణాల నరేందర్ ఆధ్వర్యంలో పదిమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో గుండారం గోవర్ధన్, శివ లాల్. నర్సన్న లక్ష్మణ్. బిజెపి సీనియర్ నాయకుడు ఆకుల ప్రభాకర్. అర్జున్ సింగ్. దమ్మాయి అనిల్ కుమార్, సందీప్, ఆకుల సతీష్, గుండారం మోహన్, బిజెపి నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.