నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన – వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని’ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయడానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.