మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించాలి

కామారెడ్డి, నవంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగం ఎంచుకొని అనుభవం, ఆసక్తి గల వ్యాపారాన్ని నిర్వహించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు.

వచ్చే సీజన్‌ నాటికి వరి కొనుగోళ్ళ సంఖ్యను మహిళా సంఘాలే ఎక్కువ చేయాలని తెలిపారు. క్యాంటీన్‌, డైరీ, ఫిష్‌ పాండ్‌, తదితర వ్యాపారాలు కొనసాగించాలని తెలిపారు. సంఘాల్లో మహిళలను సభ్యులుగా చేర్చాలని, ఋణాలు తీసుకున్న వారి నుండి రికవరీ చేయాలని తెలిపారు. లింగంపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలనీ తెలిపారు. అంతకుముందు 36 వేల రూపాయలతో నిర్మించనున్న రూఫ్‌ టాప్‌ రైన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌ మాట్లాడుతూ, 14 అంశాలతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. మండల మహిళా అధ్యక్షురాలు జి.సులోచన మాట్లాడుతూ, కొత్త గ్రూపులను ఏర్పాటుచేస్తున్నామని పిండి గిర్ణి, నాటు కోళ్లు, డైరీ, క్యాంటీన్‌, వంటి వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ గంగాధర్‌, తహసీల్దార్‌ భిక్షపతి, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యురాల్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »