బాన్సువాడ, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం భువన్ సర్వే పూర్తయిన తర్వాతనే ఇంటి పన్నులు పెంచాలని బిజెపి నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
మూడు సంవత్సరాల క్రితం పట్టణంలో భువన్ సర్వే పేరుతో 60 శాతం మాత్రమే సర్వే చేసి పట్టణ ప్రజలకు పన్నులు పెంచారని, పెంచిన వారిలో చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పట్టణంలో వందశాతం సర్వే చేపట్టిన తర్వాతనే పన్నులు వసూలు చేయాలని, ఇప్పటివరకు పెంచిన టాక్స్ కట్టిన వారికి మున్సిపాలిటీ తిరిగి డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడుతామన్నారు.
సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తూప్తి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు కోణాల గంగారెడ్డి తదితరులు ఉన్నారు.