నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ న్యాయవాది ఖాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపై చర్చించి న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్దా మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుందని, గుండగిరి రాజ్యం ఎలుతుందని, దీనిని అరికట్టి శాంతిభద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఖాసింపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసే వరకు ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
ఆందోళనకు స్పందించిన అడిషనల్ డిసిపి బసవరెడ్డి జిల్లా కోర్టు వద్ద వచ్చి న్యాయవాదులతో మాట్లాడి దాడి కేసులో హత్యయత్నం సెక్షన్ ఆల్టరేషన్ చేసే కోర్టులో మేమో దాఖలు చేశామని, విచారణకు బృందాలను ఏర్పాటు చేశామని కచ్చితంగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, వసంతరావు, రాజు, సురేష్, పిల్లి శ్రీకాంత్, అయూబ్, పరుచూరి శ్రీధర్, భాస్కర్, పి వెంకటేష్, మాణిక్‌రాజ్, ఆశ నారాయణ, రాజు, రవీందర్, విగ్నేష్, జైపాల్, జునేద్, ఇర్ఫాన్, జిషంత్, ఇంతియాజ్, ఖలీద్, కవిత రెడ్డి, అంజలి, కావ్య, అఖిల, ప్రవీణ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.