నందిపేట్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ విగ్రహం, సుధా టిఫిన్ సెంటర్ దగ్గర గల దర్గా ను తొలగించాలని రాంనగర్ కాలనీవాసులు, గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలసి వినతి పత్రాన్ని అందజేశారు. సుధా టిఫిన్ సెంటర్ వద్ద గల దర్గా రోడ్డు వెడల్పులో తీయవలసి ఉండగా దర్గాని అలానే ఉంచేసి రోడ్డును కుదించేసి అసంపూర్తిగా పనులు చేయడంతో గ్రామస్తులకు, ముఖ్యంగా రాంనగర్ కాలనీవాసులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వివరించారు.
కాలనీ ముఖ ద్వారం దగ్గర దర్గా వల్ల ఇరుకవ్వడంతో బడి పిల్లల వాహనాలు, అలాగే కాలనీకి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలిగి ప్రమాదాలు జరుగుతున్నాయ ని కలెక్టర్‌కు చెప్పారు. ప్రజల సౌకర్యార్థం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న దర్గాను రోడ్డు వెడల్పులో భాగంగా తీసివేయాలని కోరారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో సీనియర్ నాయకులు నాగలింగం, మంద నడిపి సాయిలు, స్వచ్ఛభారత్ జిల్లా నాయకులు వీరేశం, జిల్లాబిజెపి బీసీ మోర్చా నాయకులు ఆరుట్ల రమేష్, మాజీ ఎంపిటిసి ఎలిగేటి రాజు, కొందపురం భోజన్న, మాజీ వార్డ్ మెంబర్ హనుమాన్లు, నాలేశ్వర్ గంగాధర్, నాగ తారక్, మెకానిక్ శ్రీను, కావేరి గంగాధర్, శ్రీకాంత్, కస్తూరి గంగాధర్, దంతాల ప్రభాకర్, తదితరులు ఉన్నారు.