నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
యువత రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతితో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ… మన రాజ్యాంగం ప్రతీ పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు రూపొందించిందన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి రూపొందించిన రాజ్యాంగంలో కులమతాలకు అతీతంగా ప్రజలకు సమాన హక్కులను కల్పించారన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ భేదాలు లేకుండా సమాన హక్కులు కల్పించబడ్డాయన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందడంతో పాటు తమ విధులను, బాధ్యతలను తెలుసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మనందరం సంతోషంగా జీవిస్తున్నామంటే అది రాజ్యాంగ చలవే అన్నారు.
భారత రాజ్యాంగం చాలా గొప్పది: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి
ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగం చాలా గొప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి అన్నారు. అంబేద్కర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిళ్లితే పౌరులు కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. అందరూ స్వేచ్ఛగా జీవించగలుతున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన వరమన్నారు.
బహుమతులు ప్రదానం
జాతీయ దినోత్సవం వేడుకలలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఒగ్గు కథ కళాకారులు రాజ్యాంగ గురించి బగ్గుకథ రూపంలో వివరిచిండంతో చూపరులను ఏంతో ఆకట్టుకుంది.
రాజ్యాంగ దినోత్సవం ర్యాలీ
రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి కంటేశ్వర్ వరకు అక్కడినుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు సిబిసి, మేరా యువభారత్, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో సీబీసీ ఎఫ్‌పిఓ బి ధర్మానాయక్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బి.నరేష్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, జిల్లా యువజన అధికారి ఎన్‌వైకె శైలి బెల్లాల్, ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, శరత్, గణితశాస్త్ర అధ్యాపకుడు బి.రామచంద్ర, ఇంగ్లిష్ లెక్చరర్ రవి, ఏపీఏ రషిద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.