కామారెడ్డి, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సావిత్రి (26) ఆమెకి పురిటి నొప్పులు రావడంతో రాత్రి వేళ 108 అంబులెన్స్ కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో.. దేవాయిపల్లి గ్రామ సమీపంలో అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డలను కాపాడారు.
రెండవ కాన్పు కావడంతో పండంటి అడ బిడ్డ జన్మించింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్యసేవల నిమిత్తం జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి లో చేర్పించినట్లు సిబ్బంది తెలిపారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- అల్లె సురేష్, పైలట్- బుక్య కార్తీక్‌లకు.. ఆమె భర్త సాయిలు కృతజ్ఞతలు తెలిపారు.