కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామపంచాయతీ, మండల, మున్సిపాలిటీ మరియు జిల్లా స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్ -2024 నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సి.ఏం.కప్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »Daily Archives: November 28, 2024
రోడ్డు ప్రమాద బాధితురాలికి రక్తం అందజేత…
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు సంతోషిని (38) హైదరాబాదులోని కిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని రక్తదాత మురికి వంశీకృష్ణ తొమ్మిదవ సారి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు …
Read More »ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట టాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. టాబ్ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన …
Read More »పరీక్ష కేంద్రాల తనిఖీ…
డిచ్‌పల్లి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా జరిగినట్టు ఆడి సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరిక్ష …
Read More »జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు …
Read More »సేకరించిన సమాచారం ఫారాలను భద్రపరచాలి…
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా వేగవంతంగా నిర్వహించే విధంగా మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »వివరాలు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీలు వెంటది వెంట నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) తో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ట్యూబ్ ఎంట్రీలు, రైతులకు చెల్లింపు అంశాలపై కలెక్టర్ పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన …
Read More »యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
డిచ్‌పల్లి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం యువతి యువకులు అందరూ కృషి చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య పి యాదగిరి రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన గోడ ప్రతులను వైస్ ఛాన్స్లర్ చాంబర్లో ఆవిష్కరించారు. డ్రగ్స్ వినియోగం వలన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టం జరగడంతో …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 7.50 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.56 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.01 – 3.47దుర్ముహూర్తము : ఉదయం 9.57 – 10.41మరల మధ్యాహ్నం 2.22 – 3.07అమృతకాలం …
Read More »