కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు సంతోషిని (38) హైదరాబాదులోని కిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని రక్తదాత మురికి వంశీకృష్ణ తొమ్మిదవ సారి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని సకాలంలో రక్తాన్ని అందజేయాలంటే రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు. గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన రక్తదాత వంశీకృష్ణకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలిపారు. రక్తదాతలు వంశీకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.