కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా వేగవంతంగా నిర్వహించే విధంగా మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమగ్ర సర్వే వివరాలను ఆయా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆన్లైన్ నమోదును వేగవంతం చేసేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను ప్రోత్సహించాలని తెలిపారు.
కామారెడ్డి మున్సిపల్ డేటా ఎంట్రీకి అవసరమైన కంప్యూటర్ ఆపరేటర్‌లను ఎక్కువగా నియమించుకోవాలని తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారం ఫారాలను భద్రపరచాలనీ తెలిపారు. మండల స్థాయిలోని డేటా ఎంట్రీ కూడా వేగవంతం చేయాలని తెలిపారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఒ రాజారాం, కామారెడ్డి మున్సిపల్ డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.