డిచ్‌పల్లి, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం యువతి యువకులు అందరూ కృషి చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య పి యాదగిరి రావు గారు పిలుపునిచ్చారు.
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన గోడ ప్రతులను వైస్ ఛాన్స్లర్ చాంబర్లో ఆవిష్కరించారు. డ్రగ్స్ వినియోగం వలన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టం జరగడంతో పాటు ప్రాణ నష్టం సంభవిస్తుందని తెలిపారు. గంజాయి సిగరెట్ అల్ట్రా జోలంతో తయారుచేసిన కల్తీకల్లుకు బానిసలు కాకూడదని తెలిపారు.
దీనివల్ల భవిష్యత్తు పరిణామాలు దారుణంగా ఉంటాయని కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. దీని కొరకు త్వరలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలలో యాంటీ డగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య అరతి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.