బాన్సువాడ, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూరు మండలంలో నిజమైన కార్యకర్తకు చైర్మన్ పదవి రావాలని సంకల్పించాలని దీనికి తోడు కాసుల బాలరాజు కూడా సమర్ధించారన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న దుర్గం శ్యామల ఎంపీపీగా, సర్పంచ్‌గా రాజకీయాలలో అనుభవం ఉన్నదని, వైస్ చైర్మన్ యమా రాములును ఎంపిక చేసామన్నారు. రుణమాఫీ రెండు లక్షలలోపు కాని వారికి సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ కాలేదని, త్వరలోనే ప్రభుత్వం చేస్తుందన్నారు.
రైతు సంక్షేమం కోరే ప్రభుత్వానికి పాటుపడాలి… కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్
రాష్ట్రంలో రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుల పండిరచిన సన్న రకం ధాన్యానికి 500 బోనస్ కల్పించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, ఆయనకు తోడుగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.
కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ దుర్గం శ్యామల, వైస్ చైర్మన్ యమా రాములు, వర్ని,కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ లు సురేష్ బాబా, హనుమంతు, పార్టీ మండలాల అధ్యక్షులు బోయిని శంకర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఎంపీపీ పాల్య విట్టల్, నాయకులు మియాపురం శశికాంత్, మోహన్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.