నిజామాబాద్, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్.ఈ) విభాగంలో టెక్నికల్ సబార్డినెట్ గా విధులు నిర్వర్తించి శనివారం పదవీ విరమణ చేసిన విద్యానందం కు ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
25 సంవత్సరాల పాటు విద్యానందం క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఆర్.ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో విద్యానందం ను పూలమాలలు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.
సమాచార శాఖలో ఆయన అందించిన సేవలను అధికారులు, సహచర సిబ్బంది కొనియాడుతూ, శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. తన ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి విద్యానందం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ ఉమేష్ చంద్ర, రిటైర్డ్ సీనియర్ పర్యవేక్షకులు రవూఫ్, మాజిద్, సిబ్బంది పాల్గొన్నారు.