కామరెడ్డి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న కుమారుడు పర్ష తృషాల్ ఓ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించారన్నారు.
కుటుంబంలోని తండ్రి తో పాటు ఇద్దరు కుమారులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని సకాలంలో రక్తాన్ని అందజేసిన రక్తదాతకు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.
దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ప్రతినిత్యం రక్తం అవసరం ఉంటుందని ఆ రక్తాన్ని సకాలంలో అందజేయకపోతే వారి ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడతాయని రక్తదానానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు.