కామారెడ్డి, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శనివారం తెలంగాణ బయో సైన్స్ ఫోరం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు 2024-25 అకడమిక్ ఇయర్ నుండి 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు జీవశాస్త్రం పరీక్షలలో వంద మార్కులు కేటాయించాలని, వాటిని పదవ తరగతి మెమోలో వేరుగా చూపించాలని అన్నారు.
అదేవిధంగా నూతన విద్యా విధానంలో సైన్స్‌కు సూచించిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యలో ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షల దృష్ట్యా ఆరు, ఏడవ తరగతిలో ఉన్న సామాన్య శాస్త్రంలో జీవశాస్త్రం మరియు ఫిజికల్ సైన్స్‌గా పుస్తకాలను ప్రచురించి ఆయా సబ్జెక్టు టీచర్ల చేత బోధించేలా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు విడుదల అయ్యేలా, జీవశాస్త్రముకు వారంలో 6 పీరియడ్లు మరియు ఒక పీరియడ్‌ను ప్రయోగశాల నిర్వహణకు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో తెలంగాణ బయోసైన్స్ ఫోరం కామారెడ్డి జిల్లా, అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణకర్ రావు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి, కోశాధికారి సురేష్, బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నరహరి రాజు, జీవశాస్త్ర సీనియర్ ఉపాధ్యాయులు ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, నాగభూషణం, పూర్ణ రావు, మల్లేష్, ప్రవీణ్ కుమార్ మరియు 20 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.