Monthly Archives: November 2024

సర్వే సేకరణ వేగవంతం చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్యుమరేటర్‌ నిర్వహించే సర్వేను సూపర్వైజర్‌లు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని, రోజువారీ నివేదికలను అప్లోడ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి మండలాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కుటుంబ సమగ్ర సర్వే వివరాలను రోజువారీ నివేదికలను ఆప్లోడ్‌ చేయాలని అన్నారు. సర్వే చేపట్టుటకు …

Read More »

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్‌ సహా తహశీల్దార్‌ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నిజామాబాద్‌ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో రెవెన్యూ ఉద్యోగులు సోమవారం సాయంత్రం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌ రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, తహశీల్దార్‌, ఇతర …

Read More »

విద్యను అందరికీ చేరువ చేసిన వ్యక్తి మౌలానా అబుల్‌ కలాం…

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో విద్యాభివృద్ధి కోసం కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఎంతో కృషి చేశారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మౌలానా అబ్దుల్‌ కలామ్‌ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన …

Read More »

క్రీడల్లో ఒకరిని గెలిపించడం ద్వారా ఎంతో తృప్తి కలుగుతుంది….

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బొర్లమ్‌ క్యాంప్‌లోని గురుకుల పాఠశాలలో పదవ జోనల్‌ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి హాజరై క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జోనల్‌ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాకారులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించడం ద్వారా, తాను శిక్షణ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నానన్నారు. …

Read More »

తప్పులు లేకుండా సమాచారం సేకరించాలి..

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా, ఏ ఒక్క ఇళ్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని వార్డ్‌ నెంబర్‌ 44 ముష్రంభాగ్‌ ( స్టేషన్‌ రోడ్డు) లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే …

Read More »

ప్రజావాణిలో 69 ఫిర్యాదులు

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారు నుండి పలు సమస్యల పై దరఖాస్తులు స్వీకరించారు. భూ సంబంధ మైన అర్జీలు, ఋణాలు మంజూరు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికై సంబంధిత …

Read More »

ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలి…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున స్థానిక తెలంగాణ అల్పసంఖ్యకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల …

Read More »

ప్రజావాణికి 70 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఆర్డీఓ సాయాగౌడ్‌, …

Read More »

దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరం (కలెక్టరేట్‌)లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి …

Read More »

న్యాయవాది మృతికి సంతాపం తెలిపిన బార్‌ అసోసియేషన్‌…

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన సీనియర్‌ న్యాయవాది తారచండ్‌ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సోమవారం మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. తారాచంద్‌ మృతికి సంతాప సూచనగా సోమవారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »