Monthly Archives: December 2024

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.21 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 5.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 2.38 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి వణిజ రాత్రి 12.05 వరకు వర్జ్యం : రాత్రి 1.10 – 2.46దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల నోడల్‌ అధికారి విజయకుమార్‌ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అంగవైకల్యం ఉందని అధైర్యపడవద్దని, మనో సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని, విద్యతో పాటు క్రీడల్లో రాణించినవారు ఇటీవల జరిగిన ఒలంపిక్స్‌ లో పథకాలను …

Read More »

మహిళా సంఘ సభ్యులకు చెక్కుల పంపిణీ

బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా సంఘ సభ్యులకు, వీధి వ్యాపారులకు రాష్ట్ర వ్యవసాయ సలాహదారు పోచారం, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది ఆయన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. అనంతరం మహిళా …

Read More »

న్యూమోనియా బాధితుడికి రక్తం అందజేత

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్‌ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్‌ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్‌ …

Read More »

భారీగా గంజాయి కాల్చివేత

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ. 3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను కాల్చివేశారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, పెద్దాక్కల్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ అమోదం పొందిన శ్రీమెడికెర్‌ సర్వీస్‌లో గంజాయిని దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలోని 36 కేసుల్లో పట్టుబ డిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, …

Read More »

విజయోత్సవాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న రంగోలి, మెగా వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, …

Read More »

5న కామారెడ్డిలో మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 న రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్‌ తో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లు, ధాన్యం …

Read More »

ఆసుపత్రిలో అదనపు గదులు ప్రారంభం

బోధన్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక శాసన సభ్యులు పి. సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బోదన్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. రూ. 66 లక్షలతో చేపట్టనున్న బోదన్‌ మండల ప్రజా పరిషత్‌ నూతన భవన నిర్మాణం పనులకు …

Read More »

నిజామాబాద్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్‌ జెండర్స్‌ సంక్షేమ శాఖా ఆద్వర్యంలో రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం, తిలక్‌ గార్డెన్‌, నిజామాబాద్‌ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు అర్బన్‌ ఎమ్మెల్యే దన్పాల్‌ సూర్య నారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమములో జిల్లా న్యాయ సేవా …

Read More »

5న నిజామాబాద్‌కు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడానికి బీ.సీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఈ నెల 5న నిజామాబాద్‌ కు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »