కామారెడ్డి, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ ఆన్నారు. కామారెడ్డి జయశంకర్ కాలనీ లోగల ఓంకారేశ్వరాలయంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథితులుగా వారు హాజరై మాట్లాడారు. ఓంకారేశ్వరాలయంలో షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ మనిషి ఎంత డబ్బు సంపాదించిన తన ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్లాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని హిందూ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గతంలో కూడా ఓంకారేశ్వర ఆలయానికి తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. వీరశైవ లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ ఓంకారేశ్వర ఆలయం కు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత ఓంకారేశ్వర ఆలయం కు మొదటిసారి గా రావడం జరిగిందని ఎంపీ షెట్కర్ అన్నారు. ఓంకారేశ్వర్ ఆలయానికి వీరశైవ లింగాయత్ సమాజం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సురేష్ శెట్కర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు కపిల ప్రభాకర్ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ, సురేష్ శెట్కార్‌లను శాలువా మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గడ్డం హిందూ ప్రియ, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కౌన్సిలర్, వీరశైవ లింగాయత్ సమాజ్ కార్యదర్శి శివరాములు ఉపాధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్, మదం శెట్టి ఆంజనేయులు, కోశాధికారి ఇంద్రశేఖర్, పటేల్ రాజు, సంగమేశ్వర్, మారుతి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.