కామారెడ్డి, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి లైన్స్ క్లబ్, కామారెడ్డి ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కామారెడ్డి నగర ప్రధాన వీధుల్లో మోటార్ సైకిల్‌పై అవగాహన నినాదాలు ఇస్తూ కొనసాగింది.
చివరకు ఐఎంఏ కార్యాలయంలో ముగించి అవగాహన విషయమై పలువురు డాక్టర్లు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ శ్యామ్ గోపాల్ రావు ప్రసంగించారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ శ్యాం గోపాల్ రావు, జిల్లా క్యాబినెట్ అధికారి లైన్ ఎం రాజన్న, కార్యదర్శి లైన్ ప్రవీణ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు లైన్ కంశెట్టి, నరసింహం, ప్రదీప్ రెడ్డి, గంగాధర్, రమేష్, మచ్చ గంగాధర్, మోహన్‌లాల్ తదితరులు హాజరయ్యారు.