కామారెడ్డి, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పశు సంవర్థక, మత్స్య శాఖ, పాడి పరిశ్రమ ద్వారా చేపట్టిన ఒక సంవత్సరం… ఎన్నో విజయాలు పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.
పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ ద్వారా మెరుగైన పశు సంరక్షణ, చేపల ఉత్పత్తి పెంపకం, పాడి రైతులకు లాభదాయక పాల ధర, అభివృద్ధి పథంలో కోళ్ళ పరిశ్రమలతో పాటు వైద్య సేవలు అందించేందుకు పశువైద్యుల నియామకం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగిందని అధికారులు తెలిపారు.