కామారెడ్డి, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కళాశాలలను ప్రారంభించారు.
ఇందులో భాగంగా కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శివ ప్రసాద్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ లక్ష్మి పలు శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.