కామారెడ్డి, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండీ వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,భూసంబంధ సమస్యలు, రుణాలు, రెండుపడక గదుల ఇళ్ల మంజూరు వంటి వాటిపై అర్జీలు రావడం జరిగిందని తెలిపారు.
ప్రజావాణి లో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో ఆదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకు ముందు జాతీయ వాయు కాలుష్య దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ చేయించారు.