బాన్సువాడ, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతోనే మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆర్థికంగా ఎదిగారని యూత్ కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్ అన్నారు. సోమవారం బీర్కూరు మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కన్న కొడుకు కంటే ఎక్కువగా సతీష్ ను చేరదీసి ఆదరిస్తే ఇసుక మొరం మాఫియా చేస్తూ ఆర్థికంగా బలోపేతమై పోచారం కుటుంబంపైనే ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే పోచారం దేవుడైతే నేను పూజారినని ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటానని చెప్పలేదొ ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బీర్కూరు మండలానికి నియంతలాగా వ్యవహరించి స్థానిక నాయకులను ఎదగనీయకుండా చేసిన వ్యక్తి సతీష్ అన్నారు.
సతీష్ తన స్థాయిని తెలుసుకోవాలంటే బీర్కూర్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తండ్రి కొడుకుల మధ్య అగాధం సృష్టించి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి అన్నారు. తండ్రి లాగా చూసిన వ్యక్తిపై నిందలు మోపడం సరికాదని, బీర్కూరు మండలంలో అభివృద్ధి పనులు ఏది జరిగిన అంతా తానై వ్యవారించి ఆర్థికంగా బలోపేతమై ప్రజలను పట్టిపీడిరచారన్నారు. తాను యూత్ నాయకుడిగా ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తి నేడు ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించామని గొప్పలు చెబుతున్నారని, ఎమ్మెల్యేగా ఇండ్లను కేటాయిస్తేనే ఒక గుత్తేదారుగా నిర్మించారు తప్ప ఎక్కడ ప్రజలకు ఉచితంగా అందజేయలేదన్నారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీడిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు నమ్మి మండలాన్ని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అప్పజెప్పితే ప్రజలను పీల్చుకుతిన్నారని, ఇకనైనా ఆరోపణలు చేసే ముందు తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని లేనిపక్షంలో పోచారం అభిమానులుగా తగిన బుద్ధి చెప్తామన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దుర్గం శ్యామల, పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, వైస్ చైర్మన్ యమ రాములు, మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు,కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్, సందీప్, మొగులగోండా, దుంపల రాజు, హైమద్, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.