నిజామాబాద్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖా ఆద్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం, తిలక్ గార్డెన్, నిజామాబాద్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమములో జిల్లా న్యాయ సేవా అధికారిణి సెక్రెటరీ పద్మావతి, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్, మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారిణి వాణిశ్రీ, డి.ఆర్.డి. ఏ/డి.ఆర్.డి.వో. ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. సాయాగౌడ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ప్రతిమా రాజ్, స్నేహ సొసైటీ సెక్రెటరీ, సిద్ధయ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ మరియు గ్రేసి ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ శోభా రాణీ, స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, ఎ.పి. ఫోరం ప్రెసిడెంట్ సి. స్వరూప, జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సభ్యులు రాజన్న, అశ్వక్ అహ్మద్ పాల్గొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవముపై తమ తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు.
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్, గ్రేసి ఆర్గనైజషన్ ఫర్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఏపీ ఫోరమ్ ఫర్ ఎకనామికల్లి వీకర్ సెక్షన్, మొదలైన స్వచ్చంద సంస్థలచే నడుపబడుచున్న ప్రత్యేక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ బాల బాలికలు ప్రదర్శించిన యోగా మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.
తదుపరి జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన పలు అతిధులకు మరియు వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు, నిరుద్యోగులకు, దివ్యాంగుల కమిటీ సభ్యులకు శాసన సభ్యులచే ప్రశంసా పత్రాలు, సన్మానాలు చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము సందర్బముగా నవంబర్ 21 నిర్వహించిన వివిధ రకాల క్రీడలలో గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులకు మరియు దివ్యాంగులకు బహుమతులు ప్రదానం చేశారు.