హైదరాబాద్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఒక ఎజెంటుకు రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్‌కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయిన సంఘటన జరిగింది.
నిజామాబాద్ జిల్లా షెట్పల్లి కి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబయి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లారని 21 నుంచి అందుబాటులో లేకుండా పోయారని అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారివెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు డా. బిఎం వినోద్ కుమార్, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు.
థాయిలాండ్ లో తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ తెలుసుకోవాలని, ఏజెంట్ పై పోలీసు కేసు నమోదు చేయాలని వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.