బాన్సువాడ, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి సిపిఐ పార్టీ తరఫున తన గళాన్ని వినిపించిన కామ్రేడ్ బాల మల్లేష్ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటని నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయ ఆవరణలో బాల మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి సిపిఐ నాయకులు సంతాప సభ నిర్వహించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దుబాస్ రాములు మాట్లాడుతూ బాల మల్లేష్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఏనలేని కృషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం కార్మిక వర్గం పాటుపడి ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్ శంకర్, సిపిఐ నాయకులు రాములు, సతీష్, లక్ష్మీనారాయణ, సుజాత, శివకుమార్,సత్యవ్వ, సాయిలు, సాయవ్వ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.