బాన్సువాడ, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల నోడల్ అధికారి విజయకుమార్ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అంగవైకల్యం ఉందని అధైర్యపడవద్దని, మనో సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని, విద్యతో పాటు క్రీడల్లో రాణించినవారు ఇటీవల జరిగిన ఒలంపిక్స్ లో పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాను ప్రసాద్, వసంత్ కుమార్, అనిల్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.