నిజామాబాద్, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్, సిబ్బంది నిఖిల్ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ మొహమ్మద్ ఇసాక్ తాగినమత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. వెంటనే బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది అతనిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి అట్టి అంబులెన్స్‌ని సీజ్ చేశారు.
డ్రైవర్‌ను సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్ అహ్మద్ మోయిద్దీన్ అంబులెన్స్ డ్రైవర్ కి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మిగతా 14 మంది తాగి వాహనాలు నడిపిన వ్యక్తులకు రూ.38 వేలు జరిమానా విధించినట్టు పోలీసువర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.