బాన్సువాడ, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా హన్మజీపేట గ్రామానికి చెందిన భానుగౌడ్ తన సమీప ప్రత్యర్థి అందే రమేష్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుకు వెళ్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షుడిగా ఎన్నికైన భానుగౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.