నిజామాబాద్, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
డిసెంబర్ 10వ తేదీ మంగళవారం రోజు ఉదయం 10:30 గంటలకు రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం బర్కత్‌పురా నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్టు రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ అన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏదేని కారణాలతో యాక్సిడెంట్లో కాళ్లు కోల్పోయిన వాళ్లు ఇట్టి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిబిరానికి వచ్చిన వారి కాళ్ళ కొలతలు తీసుకొని పంపించబడును. వారం తర్వాత వారికి సరిపడా జైపూర్ ఫుట్ ద్వారా కృత్రిమంగా తయారుచేసిన కాళ్ళను బాధితులకు అందజేయడం జరుగుతుందన్నారు.
వికలాంగుల దినోత్సవ సందర్భంగా అధ్యక్షులు రజినీష్ కిరాడ్ రోటరీ కార్యవర్గ సభ్యులు వికలాంగులకు పండ్లు, మిఠాయిలు పంపిణీచేసి వికలాంగులను సన్మానించి, వారు దివ్యాంగులని బాధపడకూడదని అనుకున్న లక్ష్యంపై శ్రద్ధ పెట్టి కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. కృత్రిమ కాళ్ళ రిజిస్ట్రేషన్ వివరాల కొరకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు రజినీష్ కిరాడ్ సెల్ నెంబర్ 9010005000 కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.