కామారెడ్డి, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మాచారెడ్డి మండల కేంద్రం ఏం.పి.డి.ఒ. కాంప్లెక్స్ లోని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఆ భవన స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం మాచారెడ్డి మెయిన్ రోడ్డులో చెత్త వేయడం ద్వారా చెత్త కుప్ప పేరుకుకొని పోయింది, అట్టి విషయంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా జరుపాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాల్ని నిరంతరంగా ప్రతీ రోజూ నిర్వహించాలని, రోడ్లపై చెత్త కనబడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ గోపి బాబు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఉన్నారు.